ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతం, పెన్షన్ ఈసారి ముందుగానే జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పరిపాలన అనుమతులు లభించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రేపే జీతాలు వేయనున్నట్లు తెలిపాయి.
వార్తలు
ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త


