హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: తీరం దాటిన తీవ్రవాయుగుండం

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటిందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా వైపు పయనిస్తున్నట్లు పేర్కొంది. ఒడిశా నుంచి మధ్య, ఉత్తర భారతంవైపు వెళ్లి రేపటికి క్రమేపీ బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. ఉత్తరాంధ్ర నదులకు వరద హెచ్చరికలను జారీ చేసింది.