హైదరాబాద్: 28°C
వార్తలు

ఖైరతాబాద్ వినాయక దర్శనాలు నిలిపివేత

TG: ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం రేపు జరగనుంది. గణపతిని రేపు ఉదయాన్నే తరలించి మధ్యాహ్నానికి నిమజ్జనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో అర్థరాత్రి నుంచి ఖైరతాబాద్‌ వినాయక దర్శనాన్ని నిలిపివేశారు. ఇవాళ వినాయకుని చుట్టూ ఉన్న షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. రేపు ఉదయం నుంచి గణనాథుని శోభాయాత్ర ప్రారంభమవుతుందని ఉత్సవ కమిటీ వెల్లడించింది.