హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికలపై కూటమి నేతల కీలక భేటీ

AP: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపై విజయవాడలో కూటమి పార్టీల నేతల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం గెలుపే లక్ష్యంగా కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి పరిస్థితులు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేయాలని నేతలు నిర్ణయించారు.