AP: భారీవర్షాల దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవి సూచించారు. సిబ్బంది, వాహనాలు, పరికరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. SKLM, VZM, మన్యం, విశాఖ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని, ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
వార్తలు
ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి: గొట్టిపాటి


