AP: అన్ని శాఖల సమన్వయం, సమిష్టి కృషితో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని TTD ప్రకటించింది. బ్రహ్మోత్సవాల సమయంలో 8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం లభించిందని తెలిపింది. హుండీ కానుకల రూపంలో రూ.28.94 కోట్లు వచ్చాయని పేర్కొంది. 33 లక్షల లడ్డూలను విక్రయించామని, 295 మంది కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపింది.
వార్తలు
సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం: TTD


