హైదరాబాద్: 28°C
వార్తలు

నౌకపై దాడి.. భారత నావికుడు మృతి

ఒమన్ తీరంలో భారత్‌ వస్తున్న 'ఎంవీ కేప్ డావ్' నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో యూపీకి చెందిన సూరజ్ యాదవ్ అనే భారత నావికుడు మృతిచెందాడు. నౌకలో 28 మంది సిబ్బంది ఉండగా.. 20 మంది భారతీయులు ఉన్నారని FSUI తెలిపింది. హర్మూజ్ జలసంధి వద్ద అమాయక నావికులపై జరుగుతున్న దాడులను యూనియన్ తీవ్రంగా ఖండించింది. నావికులకు పూర్తి భద్రత కల్పించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.