హైదరాబాద్: 28°C
వార్తలు

రుబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షలపై చర్చ

న్యూయార్క్‌లో జరుగుతున్న ఐరాస సమావేశాల సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కేంద్రమంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. గల్ఫ్‌ ప్రాంత పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపైనా ఇరువురు నేతలు చర్చించారు. అంతేకాకుండా రష్యా, ఇరాన్‌పై అమెరికా తీసుకువచ్చిన ఆంక్షల చట్టంపై భారత్ తన ప్రయోజనాలు, ఆందోళనలను మరోసారి అమెరికాకు స్పష్టం చేసినట్లు జైశంకర్ తెలిపారు.