హైదరాబాద్: 28°C
వార్తలు

జ్ఞానేష్‌ కుమార్‌‌ను తొలగించాలి: సంజయ్ రౌత్

SIR విషయంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పట్టించుకోలేదని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. దీంతో జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి వెంటనే చర్యలు చేపట్టాలని లేదంటే నిరంకుశ పాలకుల నుంచి దేశాన్ని రక్షించడానికి ఆర్మీ చీఫ్ ముందుకు రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.