హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు కుటుంబానికి తక్షణ పరిహారం అందించాలి: బొర్రన్న

ADB: సాత్నాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రైతు నలగంటి మోహన్, పంట నష్టంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనపై రైతు స్వరాజ్య వేదిక జిల్లాధ్యక్షుడు బొర్రన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వ జీవో 194 ప్రకారం రూ.6 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కోరారు.