హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కన్నులపండుగగా వినాయక శోభాయాత్ర

MDK: రామాయంపేటలో వినాయక నిమజ్జన శోభాయాత్ర కనులవిందుగా సాగుతోంది. గణేష్ నవరాత్రులు ముగియడంతో పట్టణంలోని దాదాపు 70 భారీ విగ్రహాలను మూడు విడతలుగా నిమజ్జనం చేసేందుకు ముస్తాబు చేశారు. భక్తుల జయజయధ్వానాలు, మహిళల ఆటపాటలు, కోలాటాల మధ్య వినాయక స్వామి నిమజ్జన యాత్ర అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.