హైదరాబాద్: 28°C
వార్తలు

నేను తప్పు చేశా: ఆత్మహత్యకు ముందు సాహిల్

IIT బాంబే విద్యార్థి సాహిల్ ఆత్మహత్య కేసు విచారణలో కీలక విషయం బయటపడింది. సాహిల్ ఆత్మహత్యకు ముందు తన స్నేహితురాలికి ఫోన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 'నేను తప్పు చేశాను. నా థర్మో డైనమిక్స్ పేపర్ కూడా సరిగా రాయలేదు' అని ఆమెతో సాహిల్ చెప్పినట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. ఈ సంభాషణల్లో ఎలాంటి కుల వివక్ష ప్రస్తావనను సాహిల్ ప్రస్తావించనట్లు తెలుస్తోంది.