హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్రెషర్స్‌ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. విమర్శలు

చండీగఢ్ యూనివర్సిటీలో జరిగిన ఫ్రెషర్స్ వేడుకలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలోనూ జూనియర్లకు స్వాగతం పలికేందుకు సీనియర్లు ఫ్రెషర్స్ వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో  కొంతమంది మగ విద్యార్థులు తమ మహిళా సహచరులను చేతుల్లోకి ఎత్తుకుని  తల్లకిందులుగా చేశారు. ఆ సమయంలో విద్యార్థినుల బాడీ ఎక్స్‌పోజ్ అవ్వడంపై పలువురు మండిపడుతున్నారు.