హైదరాబాద్: 28°C
వార్తలు

బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

బాణసంచా, డీజేలు, లేజర్ బీమ్స్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా రహదారులపై బాణసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన ఊరేగింపుల్లో లౌడ్‌స్పీకర్లు, డీజేలు, లేజర్ బీమ్స్ వినియోగం కూడా పూర్తిగా అనవసరమని పేర్కొంది. లౌడ్‌స్పీకర్లు, బాణసంచా ఉపయోగించడం వల్ల దేవుడి నుంచి అదనపు ఆశీర్వాదాలు లభిస్తాయా? అని నిలదీసింది.