హైదరాబాద్: 28°C
వార్తలు

కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మరియదాసు (35) కుటుంబానికి GPAI కింద రూ.21.15 లక్షల చెక్కును ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం అందజేశారు. జూలై 12న ఒంగోలు పద్మ టవర్స్ సమీపంలో జరిగిన ప్రమాదంలో మరియదాసు మృతి చెందారు. ఆయన సతీమణి కే. భారతికి చెక్కు అందించిన ఎస్పీ, కుటుంబ యోగక్షేమాలు, పిల్లల చదువుల వివరాలను తెలుసుకున్నారు.