హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో అత్యవసర కాల్ సెంటర్ ఏర్పాటు

GNTR: వర్షాల నేపథ్యంలో తెనాలి మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్ట్రీట్ లైట్లు, చెట్లు విరగటం, రోడ్లపై మురుగు, పారిశుద్ధ్య సమస్యల నివారణకు సంబంధించిన ఫిర్యాదుల కోసం బుధవారం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ నెల 25 వరకు కార్యాలయంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు 9849907262 నంబర్‌కు ఫోన్ చేసి అత్యవసర సమస్యలను తెలియజేయాలని అధికారులు కోరారు.