ASR: పాడేరు ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో 100మంది తల్లులు, నవజాత శిశువులకు కలెక్టర్ నిశాంతి బుధవారం బేబీ కిట్లను పంపిణీ చేశారు. శిశువులకు తల్లిపాలు, పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం, సకాలంలో వైద్య సేవలు అందించాలన్నారు. టీకాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బేబీ కిట్లను పంపిణీ చేసిన కలెక్టర్

