హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన

ASR: ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జీకేవీధి సీఐ సుధాకర్, సీలేరు ఎస్సై యాసిన్ సూచించారు. బుధవారం సీలేరు ఏపీ జెన్‌కో కార్యాలయంలో ప్రభుత్వ, ఏపీ జెన్‌కో ఉద్యోగులకు ఆన్‌లైన్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింకులు, మెసేజ్‌లపై క్లిక్ చేయవద్దన్నారు. ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు.