KDP: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాధవరం-1PHC వైద్యాధికారి డాక్టర్ శ్రీ విద్య సూచించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల చుట్టూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి చికిత్స పొందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'

