VZM: ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు జాతీయ ఔషధ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అవగాహన ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు, వైద్య విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. మందులను వైద్యుల సూచన మేరకు మాత్రమే వినియోగించాలని, ప్రతికూల ఔషధ ప్రతిచర్యలు కనిపిస్తే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఔషధ భద్రతపై అవగాహన కార్యక్రమాలు

