ఈసీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. బీజేపీ, RSS, ఈసీ కలిసి దేశ ద్రోహానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఓట్ చోరి భారత ప్రజలపై నేరం, రాజ్యాంగంపై దాడిగా అభివర్ణిస్తూ మండిపడ్డారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారించాలని డిమాండ్ చేశారు. ఈసీ సభ్యులు తమ విధులను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించలేకపోతే అది ప్రజాస్వామ్యానికి ఆందోళనకర పరిణామమని వాపోయారు.
వార్తలు
ఈసీ దేశ ద్రోహానికి పాల్పడింది: రాహుల్


