హైదరాబాద్: 28°C
వార్తలు

కాషాయ గూటికి చేరిన 8 మంది ఎమ్మెల్యేలు

మేఘాలయలో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు సామూహికంగా బీజేపీలో చేరారు. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో వీరంతా కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈశాన్య భారతంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ఆకర్షితులై వీరంతా బీజేపీలో చేరారని కేంద్రమంత్రి వెల్లడించారు.