హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బనగానపల్లె బస్టాండులో మురుగునీరు

NDL: బనగానపల్లె బస్టాండ్ ఆవరణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు మురుగునీరు చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బుధవారం సీపీఐ మండల కార్యదర్శి శివయ్య బస్టాండ్ ఆవరణలో ఉన్న మురుగునీటిని పరిశీలించారు. అనంతరం అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.