ఐరాసలో పీఓకేపై పాక్ తీరును కశ్మీర్ యువతి తస్లీమా అక్తర్ ఎండగట్టారు. పీవోకేలో కనీస పౌర స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. హక్కుల కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వందలాది మందిని పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ధ్వజమెత్తారు. ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసి ఆందోళనకారులపై జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఐరాసలో పాక్‌ను ఎండగట్టిన కశ్మీర్ యువతి


