హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి'

AKP: పరవాడ బర్నింగ్ రహదారి మధ్యలోని మెల్లోడు గడ్డలోకి ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలు విడుదల చేస్తున్న విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఈ వ్యర్థ జలాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి గాలి, నీరు, నేలను కలుషితం చేస్తోందని ఆరోపించారు.