హైదరాబాద్: 28°C
వార్తలు

గణేశ్ లడ్డూకు రికార్డ్ ధర..!

SRD: కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎదురుగూడెంలో గణపతి తొలి లడ్డూ ప్రసాదం రూ.3 లక్షలకు కార్తీక్ అనే యువకుడు దక్కించుకున్నారు. రెండో లడ్డూను శివ అనే యువకుడు రూ.2,40,000లకు కైవసం చేసుకున్నారు. దీంతో గణేశ్ మండపం నిర్వాహకులు ఇద్దరినీ సన్మానించారు. లడ్డూ ప్రసాదాలు దక్కడం గణనాథుడి కృపవల్లే సాధ్యమైందని యువకులు తెలిపారు.