TPT: నేటితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చివరి అంకం చక్రస్నానం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరగనుంది. స్వామివారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి పూజారులు ఈ క్రతువును నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఆనంద నిలయానికి చేర్చనున్నారు. పుష్కరిణి స్నానం భక్తుల కోసం రోజంతా ఉంటుందని టీటీడీ వెల్లడించింది. రేపటి నుంచి అర్జిత సేవలు, టోకెన్ దర్శనాలు యథావిధిగా జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు


