హైదరాబాద్: 28°C
వార్తలు

మెంతికూర తెస్తే రూ.50 జరిమానా?

మహారాష్ట్రలోని ఠాణె జిల్లా భాయందర్‌లో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు మెంతికూర వంటకం తీసుకొచ్చినందుకు రూ.50 జరిమానా విధించిందన్న వార్తలు వివాదాస్పదమయ్యాయి. పర్యూషన్‌ పర్వదినం సందర్భంగా మెంతితోపాటు కొన్ని కూరగాయల వంటకాలను పాఠశాలలోకి తీసుకురావడాన్ని నిషేధించారు. ఈ వ్యవహారంపై భాయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.