హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరు అభివృద్ధికి రూ.19 కోట్లు: రంగస్వామి

కడప: మైదుకూరు మున్సిపాలిటీలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.19 కోట్ల నిధులు మంజూరు చేసిందని కమిషనర్ రంగస్వామి తెలిపారు. మంగళవారం స్త్రీశక్తి భవన్‌లో సమావేశం నిర్వహించారు. నిధులతో రహదారులు, పార్కులు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.