హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త!

W.G: నరసాపురం-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం 07291 నంబర్ రైలు నరసాపురంలో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు తిరువణ్ణామలై చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07292 సోమవారం రాత్రి 8 గంటలకు బయలుదేరి, మంగళవారం ఉదయం 10:45 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.