W.G: తాడేపల్లిగూడెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి. వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. మృతుడు 5.2 అడుగుల ఎత్తు, 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉన్నాడన్నారు. రైలు నుంచి జారిపడటం లేదా ట్రాక్ దాటుతుండగా ఢీకొని మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి


