హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు బ్యాంకింగ్‌పై అవగాహన

కడప: మైదుకూరులోని ZPHS విద్యార్థులు వృత్తి విద్యలో భాగంగా మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకును సందర్శించారు. బ్యాంకు సేవలు, పొదుపు, లావాదేవీల నిర్వహణ, ఉద్యోగ అవకాశాలపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్, బ్యాంకు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.