హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి కేంద్రమంత్రుల ‘చింతన్ శిబిర్’ 

కేంద్ర మంత్రివర్గం రెండు రోజుల ‘చింతన్ శిబిర్’కు నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది. ఢిల్లీలోని సేవా తీర్థ్ భవన్‌లో జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ‘వికసిత్ భారత్-2027’ సహా కీలక అంశాలపై ఆరు బృందాలు ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నాయి. పాలన, అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై సమావేశాల్లో చర్చ జరగనున్నట్లు సమాచారం.