హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో 1.99 లక్షల మంది ఓటర్లు

నంద్యాల 52 వార్డుల్లో 1,99,238 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఓటర్లలో 96,672 మంది పురుషులు, 1,02,488 మంది మహిళలు, 78 మంది ఇతరులు ఉన్నారని వెల్లడించారు. జాబితాలో అర్హుల పేర్లు ఉండేలా, తప్పులు ఉంటే సరిదిద్దేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.