హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుపై వల్లభనేని వంశీ విమర్శలు

కృష్ణా: గన్నవరంలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో నేత వల్లభనేని వంశీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గ్రామాల్లో నాలుగైదు మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని, జగన్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్షించారు.