హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

TG: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కొత్తగూడెంకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.