హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టిదిబ్బలతో రాకపోకలకు ఇబ్బందులు

CTR: పలమనేరు పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై గృహ నిర్మాణ వ్యర్థాలను కుప్పలుగా పోస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రద్దీగా ఉండే రహదారిపై భారీ వాహనాలు వచ్చినప్పుడు చిన్న వాహనాలు, ద్విచక్ర వాహనాలకు దారి లేక ప్రమాదాల ముప్పు ఏర్పడుతోంది. అధికారులు స్పందించి వ్యర్థాలను తొలగించి రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.