AP: భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ, మన్యం, విజయనగరం, అల్లూరి, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించింది. అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవు వర్తిస్తుంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు
ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు


