PLD: వినుకొండ 8వ వార్డులోని కొత్తపేట SBI బ్యాంక్ లైన్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణపతి మండపాన్ని సందర్శించిన చీఫ్ విప్


