హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రేటర్‌ విశాఖ నేతలతో నేడు జగన్‌ భేటీ

AP: YCP అధినేత, మాజీ CM వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖ నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే భేటీలో.. GVMC పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణ, స్థానిక రాజకీయ పరిణామాలపై మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో జగన్ చర్చించనున్నారు.