హైదరాబాద్: 28°C
వార్తలు

అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ వినాయక దర్శనాలు

TG: ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం ఎల్లుండి జరగనుంది. గణపతిని ఆ రోజు ఉదయాన్నే తరలించి మధ్యాహ్నానికి నిమజ్జనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం ఖైరతాబాద్‌లో భక్తుల దర్శనానికి ఇవాళ రాత్రి వరకే అవకాశం కల్పించనున్నారు. రేపు షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో గణనాథుని దర్శనాలు నేటి రాత్రి నుంచి నిలిపివేస్తామని ఉత్సవ కమిటీ వెల్లడించింది.