హైదరాబాద్: 28°C
వార్తలు

'విమాన సేవలతో రియల్ ఎస్టేట్ వృద్ధి'

చిన్న నగరాలు, పట్టణాల్లో విమానసేవలను విస్తరించడం వల్ల.. స్థానికంగా రియల్ ఎస్టేట్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉడాన్ పథకం వల్ల రవాణా సౌకర్యం పెరిగి, ఆయా ప్రాంతాలలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కిందని చెప్పారు. విమానాశ్రయాల నిర్వహణ వల్ల స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు భారీగా లభించాయని ఢిల్లీలో చెప్పారు.