హైదరాబాద్: 28°C
వార్తలు

ఉడాన్ పురోగతి అద్భుతం: రామ్మోహన్ నాయుడు

సాధారణ పౌరులకు కూడా విమాన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉడాన్ పథకం.. అద్భుత పురోగతి సాధించిందని కేంద్రం మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారత ప్రాంతీయ విమాన అనుసంధానం ఉడాన్ పథకం ద్వారా ఊహించని స్థాయికి చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఉడాన్ వల్ల ప్రయాణికుల సంఖ్యతో పాటు విమానాల సంఖ్య భారీగా పెరిగి, భారత విమానయాన ముఖచిత్రమే మారిపోయిందని తెలిపారు.