TG: కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు, MLAలు, అధికారులు ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు. నారాయణపూర్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని నిన్నటి భేటీలో నేతలు విజ్ఞప్తి చేశారు. నెల రోజుల పాటు 5 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలను.. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టుకు విడుదల చేయాలని కోరారు. ఇవాళ్టి భేటీ తర్వాత నీటి విడుదలపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
వార్తలు
కర్ణాటక CMతో నేడు మరోసారి భేటీ


