హైదరాబాద్: 28°C
వార్తలు

'వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి'

AP: భారీ వర్షాలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.