హైదరాబాద్: 28°C
వార్తలు

హానికర ఉత్పత్తుల ప్రచారం వద్దు: రాష్ట్రపతి 

ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను నటులు ప్రచారం చేయవద్దని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరారు. జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో ఆమె మాట్లాడుతూ.. నిజమైన స్టార్ అంటే వెలుగు పంచేవాడేనని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ప్రచారం చేయడం ద్వారా యువతకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే, అవార్డుల జ్యూరీలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆమె ఆకాంక్షించారు.