హైదరాబాద్: 28°C
వార్తలు

'బీజేపీ ధర్నాతోనే ప్రభుత్వం దిగొచ్చింది'

కరీంనగర్‌లోని చింతకుంట కెనాల్ వద్ద వినాయక నిమజ్జనానికి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడం బీజేపీ, హిందూ సంఘాల ధర్నా పోరాట విజయమేనని పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి గుంజేటి శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు క్రెడిట్ కోసం గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. నిమజ్జన ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.