హైదరాబాద్: 28°C
వార్తలు

'ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలి'

PLD: రాబోయే 2026–27 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి 100 శాతం ఈ-పంట నమోదు చేయించాలని సూచించారు. రైతులకు గోనె సంచులు, వర్షాల సమయంలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.