హైదరాబాద్: 28°C
వార్తలు

కర్నూలులో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం

KRNL: వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కర్నూలు నగరంలో మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం భక్తులు డప్పులు, మేళతాళాలు, నృత్యాలతో శోభాయాత్రగా విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేశారు.