హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ ఊరిలో ప్రేమ పెళ్లిళ్లపై నిషేధం..

హరియాణాలోని హిసార్‌ జిల్లా ఆర్యానగర్ గ్రామ పంచాయతీ ప్రేమ పెళ్లిళ్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ప్రేమ వివాహాలను నిషేధిస్తున్నట్లు పెద్దలు ప్రకటించారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకునే జంటలతో పాటు వారి కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఈ గ్రామంలో పుట్టిపెరిగిన యువతీయువకులను ఇకపై అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములుగా భావిస్తామని తెలిపారు.